: రెండో వికెట్ కోల్పోయిన సఫారీలు
మూడో వన్డేలో దక్షిణాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. 19వ ఓవర్ వేసిన అమిత్ మిశ్రా బౌలింగ్ లో క్రీజ్ వెలుపలికి వచ్చి షాట్ కొట్టబోయిన ఆమ్లా (5) స్టంపౌట్ అయ్యాడు. ధోని క్షణాల్లో బెయిల్స్ పడగొట్టడంతో ఆమ్లా వెనుదిరగక తప్పలేదు. రెండో వన్డేలో కూడా ఆమ్లా స్టంపౌట్ అవడం తెలిసిందే. 14వ ఓవర్ లో సఫారీలు తమ మొదటి వికెట్ కోల్పోయారు. హర్భజన్ సింగ్ బౌలింగ్ లో మిల్లర్ అవుటవడంతో దక్షిణాఫ్రికా వికెట్ల పతనం మొదలైంది.