: అమరావతి శంకుస్థాపన విజయవంతం కావాలి: కరుణానిధి


నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం విజయవంతం కావాలని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు గొప్ప అభివృద్ధి బాటలో పయనించాలని ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎంకే) అధ్యక్షుడు కరుణానిధి ఆకాంక్షించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఒక లేఖ రాశారు. కాగా, అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకావాలంటూ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ప్రతిపక్ష నేతలను, వీవీఐపీలను, పలువురు ప్రముఖులను ఆంధ్రా సర్కార్ ఆహ్వానిస్తోంది. స్వయంగా కలిసి ఆహ్వాన పత్రాలను అందజేయడం, ఫోన్ల ద్వారా తెలియజేయడం, ఈ-మెయిళ్లు పంపంచి వారిని ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News