: పోలీసుల అదుపులో పటేళ్ల యువనేత హార్దిక్


గుజరాత్ లో జరుగుతున్న భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్ ను అడ్డుకుంటామని హెచ్చరించిన పటేళ్ల యువనేత హార్దిక్ పటేల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజ్ కోట్- జామ్ నగర్ జాతీయ రహదారిపై హార్దిక్ ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. హార్దిక్ పటేల్, ఆందోళనకారులతో కలసి స్టేడియం వైపు బయలుదేరి వస్తున్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.ఇక్కడ జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ జరుగుతున్న రాజ్ కోట్ స్టేడియానికి అత్యంత పటిష్ట భద్రత కల్పించారు. కాగా, పటేళ్ల యువనేత హార్దిక్ తమ కులస్తులకు రిజర్వేషన్లు కల్పించాలంటూ ఇటీవల నిర్వహించిన సభలు, సమావేశాల విషయం తెలిసినదే!

  • Loading...

More Telugu News