: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా


నేడు రాజ్ కోట్ లో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకుంది. ఐదు వన్డేల సిరీస్ లో ఇప్పటికే 1-1 స్కోరుతో ఇరు జట్లు సమానంగా ఉన్నాయి. ఈ మ్యాచ్ లో విజయం సాధించేందుకు రెండు జట్లు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. స్పిన్ మాయాజాలంతో సఫారీలను మళ్లీ బోల్తా కొట్టించి విజయం కైవసం చేసుకునేందుకు మన స్పిన్నర్లు తహతహలాడుతున్నారు. అయితే, ఈ పిచ్ సీమర్లకు అనుకూలిస్తుందని, బంతి స్వింగ్ అయ్యే అవకాశాలున్నాయని క్రీడాపండితులు అంటున్నారు. భారత్ జట్టు రోహిత్ శర్మ, ధావన్, రహానె, కోహ్లి, ధోని (కెప్టెన్), రైనా, అక్షర్ పటేల్, భువనేశ్వర్, హర్భజన్, మోహిత్ శర్మ, అమిత్ మిశ్రా దక్షిణాఫ్రికా జట్టు ఆమ్లా, డికాక్, డుప్లెసిస్, డుమిని, డివిలియర్స్ (కెప్టెన్), మిల్లర్, బెహార్డీన్, స్టెయిన్, రబడ, ఇమ్రాన్, తాహిర్, మోర్నీ మోర్కెల్

  • Loading...

More Telugu News