: నిబంధనలు మార్చలేం: చిన్న బ్యాంకులకు స్పష్టం చేసిన ఆర్బీఐ


మిగతా పెద్ద బ్యాంకులతో పోలిస్తే, మరింత సులువుగా తాము రుణాలిచ్చేలా చూస్తూ నిబంధనలను సవరించాలని కోరిన చిన్న బ్యాంకులకు చుక్కెదురైంది. ఇటీవల బ్యాంకింగ్ సేవలందించేందుకు అనుమతులు పొందిన సంస్థలు, సీఆర్ఆర్ (క్యాష్ రిజర్వ్ రేషియో), ఎస్ఎల్ఆర్ (స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో)ల విషయంలో ప్రధాన బ్యాంకులతో పోలిస్తే తక్కువగా ఉండేలా చూడాలని చేసిన విన్నపాన్ని మన్నించలేమని ఆర్బీఐ స్పష్టం చేసింది. బ్యాంకింగ్ వ్యవస్థలో నిబంధనలు ఒకేలా అమలవుతాయని ప్రకటించింది. మొత్తం 10 చిన్న సంస్థలకు ఆర్బీఐ బ్యాంకింగ్ లైసెన్సులను ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సంస్థలన్నీ సీఆర్ఆర్, కాపిటల్ స్ట్రక్చర్ విషయంలో మిగతా బ్యాంకులు పాటిస్తున్న నిబంధనలనే పాటించాలని ఆదేశించినట్టు ఆర్బీఐ అధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు ఆర్బీఐ ఉన్నతాధికారుల సమీక్ష అనంతరం నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు.

  • Loading...

More Telugu News