: ఇండియాకు వస్తే, తల్లిదండ్రుల కన్నా ముందు అతన్నే కలవాలి... గీత మనసులోని కోరిక!


ఇండియా నుంచి సరిహద్దులు దాటి పాకిస్థాన్ లో ఆశ్రయం పొందిన మూగ, బధిర యువతి గీత, తాను ఇండియాకు వస్తే, తల్లిదండ్రులకన్నా ముందు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను కలవాలని భావిస్తోంది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించినట్టు ముఖ్ బదిర్ ఆర్గనైజేషన్ సంస్థ డైరెక్టర్ జ్ఞానేంద్ర పురోహిత్ వెల్లడించారు. ఈ నెల 26న ఆమె భారత్ కు రావచ్చని తెలిపారు. తాము గీతతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడామని, ఈ సందర్భంగా ఆమె తన మనసులోని కోరికను వెల్లడించిందని అన్నారు. కాగా, సల్మాన్ నటించిన 'బజరంగీ భాయీజాన్' చిత్రం విడుదలైన తరువాత, దాదాపు అదే విధమైన గీత కథ వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News