: షీనా బోరా హత్య గురించి తొలి క్లూ ఎలా తెలిసిందంటే..!
హై ప్రొఫైల్ మర్డర్ కేసుగా గత కొంతకాలం నుంచి హెడ్ లైన్స్ లో ఉన్న షీనా బోరా హత్య కేసులో పోలీసులకు తొలి క్లూ ఇచ్చిందెవరో తెలిసింది. హత్య జరిగిన దాదాపు రెండేళ్ల తరువాత ఈ కేసు గుట్టు రట్టు కావడానికి ప్రధాన కారణం ఇంద్రాణి ముఖర్జియా మాజీ డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్. 'టైమ్స్ ఆఫ్ ఇండియా' కథనం ప్రకారం, ఫుల్లుగా తాగేసిన శ్యామ్ వర్ రాయ్, పోలీసులకు నమ్మకమైన ఇన్ఫార్మర్ గా ఉంటూ, ఆటోను నడుపుతున్న ఓ యువకుడికి ఈ విషయం చెప్పాడు. ఓ ధనవంతురాలైన యువతి, తన కూతురిని హత్య చేసి, విషయం చెప్పకుండా ఉండేందుకు తనకు డబ్బిచ్చిందని వెల్లడించాడు. విషయాన్ని మెల్లగా లాగిన ఆ పోలీసు, దాన్ని ఖర్ ప్రాంతం ఇనస్పెక్టర్ దినేష్ కు చేరవేశాడు. ఆపై ఆగస్టు 21న రాయ్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు మొత్తం విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. పోలీసుల విచారణ ముగియక ముందే, కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే.