: చెన్నైలోని చిన్న కంపెనీలో చేరిన ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ


ఇన్ఫోసిస్ లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా పనిచేసిన వి. బాలకృష్ణన్ చెన్నై కేంద్రంగా నడుస్తున్న చిన్న సంస్థ కార్ టెక్నాలజీస్ లో చేరారు. ఆయన బోర్డులో స్వతంత్ర డైరెక్టరుగా చేరారని, సంస్థ ఆడిట్ కమిటీకి హెడ్ గానూ విధులను చేపట్టనున్నారని కార్ టెక్నాలజీస్ సీఈఓ మారన్ నాగరాజన్ తెలిపారు. బాలకు ఆనందంగా స్వాగతం పలుకుతున్నామని ఆయన తెలిపారు. 2020లోగా సంస్థను రూ. 1000 కోట్ల ఆదాయం వచ్చే స్థితికి తీసుకెళ్లే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నామని, వీటికి బాలకృష్ణన్ అనుభవం ఎంతో ముఖ్యమని ఆయన అన్నారు. సాలీనా 50 శాతానికి పైగా వృద్ధితో తమ సంస్థ సాగుతోందని తెలిపారు.

  • Loading...

More Telugu News