: రిలయన్స్ 4జీ స్మార్ట్ ఫోన్...ధర రూ. 4 వేలు... ఫీచర్స్ ఇవిగో!


రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ లో భాగంగా ఉన్న రిలయన్స్ రిటైల్, తాము మార్కెట్లోకి విడుదల చేస్తున్న 4జీ ఎల్టీఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లను వెల్లడించింది. 'లైఫ్' బ్రాండ్ కింద రూ. 4 వేలకు లభించే ఈ ఫోన్ ద్వారా ప్రపంచంలోనే అత్యుత్తమంగా ఉండేలా 4జీ సేవలను అందిస్తామని ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఫోన్ లో వాయిస్ ఓవర్ ఎల్టీఈ, వాయిస్ ఓవర్ వైఫై, హై డెఫినిషన్ క్వాలిటీ వీడియో కాలింగ్ తదితర సదుపాయాలుంటాయని, నెలకు రూ. 300 చెల్లించి 4జీ సేవలను పొందవచ్చని పేర్కొంది. రిలయన్స్ రిటైల్ తో పాటు లైఫ్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్లను అన్ని ప్రముఖ మొబైల్ మల్టీ బ్రాండ్ ఔట్ లెట్ల ద్వారా అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపింది. కాగా, లైఫ్ సిరీస్ లో రూ. 4 వేల కనిష్ఠ ధర నుంచి రూ. 25 వేల వరకూ పలు మోడల్స్ లో స్మార్ట్ ఫోన్లు లభిస్తాయని తెలుస్తోంది. ఎంచుకునే వేరియంట్ ను బట్టి 4జీతో పాటు మెరుగైన కెమెరా, ఇతర ఫీచర్లు, ప్రాసెసర్లు తదితరాలు ఉంటాయి.

  • Loading...

More Telugu News