: నాకు టికెట్ దొరికింది, మ్యాచ్ కి వస్తున్నా, కాచుకోండి: హార్దిక్ పటేల్


రాజ్ కోట్ లో నేడు జరగనున్న భారత్, దక్షిణాఫ్రికా క్రికెట్ మ్యాచ్ కి హాజరై పటేళ్లకు రిజర్వేషన్ల కోసం నిరసన తెలియజేయనున్నట్టు యువనేత హార్దిక్ పటేల్ స్పష్టం చేశారు. తనకు, తన మద్దతుదారులకు టికెట్లు దొరికాయని, తాము స్టేడియంకు వస్తున్నామని అన్న ఆయన, తమను అడ్డుకోవాలని చూస్తే, పటేళ్ల యువశక్తి ఏంటో ఈ రోజే ప్రభుత్వానికి తెలుస్తుందని హెచ్చరించారు. పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి రాజ్ కోట్ యూనిట్ తన టికెట్ ను కొనుగోలు చేసిందని ఆయన అన్నారు. ఎస్సీఏ స్టేడియం వద్దకు రావాలని 50 వేల మంది పటేల్ వర్గం యువకులకు పిలుపునిచ్చిన హార్దిక్, ఈ మ్యాచ్ లో నిరసనలు తెలపాలని కోరిన సంగతి తెలిసిందే. మరోవైపు మ్యాచ్ కి ఎటువంటి అంతరాయం కలుగకుండా చూసేందుకు భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు.

  • Loading...

More Telugu News