: ఈ కారణం వల్లే శంకుస్థాపనను బహిష్కరిస్తున్నాం: బొత్స


ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి తమ పార్టీ వ్యతిరేకం కాదని వైకాపా నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. రాజధాని నిర్మాణం పేరుతో ప్రభుత్వం చేస్తున్న కుంభకోణాన్ని మాత్రమే తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు. శంకుస్థాపనకే కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. ఇందులో ప్రచార ఆర్భాటం తప్ప మరేమీ లేదని అన్నారు. సింగపూర్ కంపెనీలకు భూమిని కట్టబెట్టి, ప్రభుత్వం రియలెస్టేట్ వ్యాపారం చేస్తోందని ఆరోపించారు.

  • Loading...

More Telugu News