: 'నా ఇటుక- నా అమరావతి' ద్వారా రూ.1.25 కోట్లకు పైగా నిధులు


ఏపీ సీఎం చంద్రబాబు చేపట్టిన 'నా ఇటుక- నా అమరావతి'కి నెటిజన్ల నుంచి అపూర్వ స్థాయిలో స్పందన వస్తోంది. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం ద్వారా 19,828 మంది 12,54,469 ఇటుకల్ని కొనుగోలు చేశారు. దాని ద్వారా మూడు రోజులకు రాజధాని నిర్మాణానికి రూ.1.25 కోట్లకు పైగా నిధులు సమకూరాయి. నూతన రాజధాని నిర్మాణంలో ప్రజా భాగస్వామ్యాన్ని కోరుతూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. రాజధానిలో భాగస్వామ్యం అయ్యేందుకు ఆన్ లైన్ లో ఒక్కో ఇటుకను రూ.10 చొప్పున కొనాల్సి ఉంటుంది.

  • Loading...

More Telugu News