: బాలీవుడ్ సినిమాల ధాటికి కుదేలవుతున్న పాక్ చిత్రసీమ


పాకిస్తాన్ లో బాలీవుడ్ సినిమాలపై తాత్కాలిక నిషేధం విధించారు. షారూఖ్ ఖాన్ 'చెన్నై ఎక్స్ ప్రెస్', అక్షయ్ కుమార్ 'వన్స్ అపాన్ టైమ్ ఇన్ ముంబయి-2' చిత్రాలను ప్రదర్శించరాదని పాక్ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయించారు. బాలీవుడ్ సినిమాల ధాటికి పాక్ సినీ పరిశ్రమ కుదేలవుతోందన్నదే వారి ప్రధాన ఆరోపణ. కాగా, ఈ రెండు చిత్రాలు ఈద్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆగస్టు 8న పాక్ లో విడుదల కావాల్సి ఉంది. పాకిస్తానీ చిత్రాలైన 'జోష్', 'ఇష్క్ ఖుదా', 'వార్', 'మేరా నామ్ అఫ్రీది' చిత్రాలకు థియేటర్లు కేటాయించేందుకే వారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News