: కేసీఆర్ ను ఆహ్వానిస్తున్నట్టే జగన్ ను చంద్రబాబు పిలవచ్చు కదా?: వైసీపీ
రాజధాని శంకుస్థాపనకు ఆహ్వానించాలనుకున్న ఏపీ ప్రభుత్వానికి జగన్ అపాయింట్ మెంట్ నిరాకరించడంపై వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఆ పార్టీ నేత ఉమ్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ సీఎం కేసీఆర్ ను స్వయంగా వెళ్లి అహ్వానిస్తున్న చంద్రబాబు జగన్ ను కూడా అలా ఎందుకు ఆహ్వానించడం లేదని ప్రశ్నించారు. తమ అధినేతను కూడా అపాయింట్ మెంట్ కోరి ఆహ్వానించవచ్చు కదా? అన్నారు. ఓ రాజకీయ పార్టీగా తమ ప్రాధాన్యాలు తమకు ఉంటాయని చెప్పారు. అయితే ఆహ్వానాన్ని గౌరవించి జగన్ వెళితే ప్రధాని పక్కన కూర్చోబెడతారా? అని నిలదీశారు. ఆరోగ్యం బాగోలేకనే జగన్ మంత్రులను కలుసుకోలేదని ఉమ్మారెడ్డి తెలిపారు.