: 'నేనేంటో మీ అయ్యను అడుగు' అన్న జానారెడ్డిపై విరుచుకుపడ్డ కేటీఆర్


ఈ నెల 9వ తేదీన వరంగల్ జిల్లా నర్సంపేటలో జరిగిన రైతు భరోసా యాత్రలో టీఎస్ మంత్రి కేటీఆర్ ను ఉద్దేశిస్తూ, "నేనేంటో మీ అయ్యను అడుగు, నీకు సరిగా తెలవదు" అంటూ తెలంగాణ సీఎల్పీ నేత జానారెడ్డి ఫైర్ అయిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై నేడు నల్గొండలో కేటీఆర్ మండిపడ్డారు. వాటర్ గ్రిడ్ పనుల ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ పథకం యొక్క గొప్పదనం పక్క రాష్ట్రం, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ సింగ్ యాదవ్ కు కూడా అర్థమయింది కాని... జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు మాత్రం అర్థం కాలేదని ఎద్దేవా చేశారు. జానారెడ్డి సొంత జిల్లా అయిన నల్గొండ ఫ్లోరైడ్ తో బాధపడుతున్నా కాంగ్రెస్ పార్టీ ఏనాడూ పట్టించుకోలేదని మండిపడ్డారు. జానారెడ్డి సంగతేంటో మా అయ్యను కాదు, ఏ అయ్యను అడిగినా చెబుతారని అన్నారు.

  • Loading...

More Telugu News