: రాజధాని శంకుస్థాపన తర్వాత కేబినెట్ ప్రక్షాళన... నలుగురు మంత్రులపై వేటు పడే అవకాశం


రాజధాని అమరావతి శంకుస్థాపన తర్వాత ఏపీ కేబినెట్ లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. కేబినెట్ ను ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. గత ఏడాదిన్నర నుంచి మంత్రుల పనితీరుపై అనేక రిపోర్టులను చంద్రబాబు తెప్పించుకున్నారు. ఈ క్రమంలో కనీసం నలుగురు మంత్రులపై వేటు పడనుందని విశ్వసనీయ సమాచారం. అంతేకాకుండా, కేబినెట్ లోకి పలువురు కీలక నేతలు రానున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు, స్పీకర్ కోడెల శివప్రసాద్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గాలి ముద్దుకృష్ణమనాయుడు, టి.శ్రవణ్ కుమార్ లకు కేబినెట్ లో బెర్త్ దక్కవచ్చు. కోడెల స్థానంలో ధూళిపాళ్ల నరేంద్రకు స్పీకర్ గా ప్రమోషన్ లభించనున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News