: కొమరవోలు గ్రామంలో పర్యటిస్తున్న నారా భువనేశ్వరి
ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని కొమరవోలు గ్రామంలో పర్యటిస్తున్నారు. ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్న తరువాత తొలిసారిగా ఆమె ఈ రోజు గ్రామాన్ని సందర్శిస్తున్నారు. మొదటిసారి గ్రామానికి భువనేశ్వరి రావడంతో స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. పర్యటన సమయంలో ముందుగా ఆమె తల్లిదండ్రుల విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 'మన నీరు- మన మట్టి' కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం గ్రామస్థుల సమస్యలను భువనేశ్వరి అడిగి తెలుసుకుంటున్నారు.