: రేపు సాయంత్రం 5 గంటలకు గవర్నర్ ను కలవనున్న చంద్రబాబు
రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్ ను ఆహ్వానించేందుకు సీఎం చంద్రబాబు అపాయింట్ మెంట్ ఖరారైంది. రేపు తన మనవడు దేవాన్ష్ అన్నప్రాసనకు సీఎం తిరుమల వెళతారు. తరువాత అక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్ వస్తారు. సాయంత్రం 5 గంటలకు గవర్నర్ ను కలసి శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేయవలసిందిగా కోరుతూ ఆహ్వాన పత్రాన్ని చంద్రబాబు అందజేయనున్నారు. ఇక ఆ సాయంకాలం 5.30 గంటలకు సీఎం కేసీఆర్ ను కలవనున్న విషయం తెలిసిందే.