: సీఎం చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలుపుతూ జానారెడ్డి లేఖ


ఏపీ రాజధాని శంకుస్థాపనకు తనను ఆహ్వానించిన నేపథ్యంలో టీసీఎల్పీ నేత జానారెడ్డి తిరిగి ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందిందని, ఆహ్వానం పంపినందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు లేఖలో పేర్కొన్నారు. అలాగే రాజధాని నిర్మాణానికి చంద్రబాబు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. అందుకు సహకారం అందిస్తున్న ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. అలాగే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకోవాలని, ఇరు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నట్టు జానా తన లేఖలో అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News