: కొండారెడ్డిపల్లిలో వైద్య శిబిరం ఏర్పాటు చేసిన ప్రకాశ్ రాజ్
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా కేశంపేట మండలం కొండారెడ్డిపల్లిని సినీ నటుడు ప్రకాశ్ రాజ్ దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ గ్రామంలో ముందుగా ప్రజల ఆరోగ్యంపై ఆయన దృష్టి పెట్టారు. ఈ మేరకు అక్కడ ఓ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సన్ షైన్ ఆసుపత్రి వైద్య బృందం సహకారంతో గ్రామంలోని చిన్నారులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించినట్టు తన ఫేస్ బుక్ ఖాతాలో ప్రకాశ్ రాజ్ తెలిపారు. దానికి సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా ఆయన పోస్ట్ చేశారు.