: రాజధాని శంకుస్థాపనకు సాయికుమార్ తో కలసి గాయని సునీత వ్యాఖ్యానం
ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ప్రముఖ సినీ గాయని సునీత కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నారు. ఇవాళ తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలసి దర్శించుకున్న సందర్భంగా ఈ విషయాన్ని ఆమె మీడియాకు తెలియజేశారు. ప్రభుత్వం తనను నియమించినందుకు సంతోషంగా ఉందని, తనపై ఉంచిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని సునీత చెప్పారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా సినీ నటుడు సాయికుమార్ ను ఏపీ ప్రభుత్వం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయనతో కలసి సునీత కూడా వ్యాఖ్యానం చేయనున్నారు.