: 'రెడ్ ఐ ఫ్లైట్ సర్వీస్' ప్రారంభిస్తోన్న స్పైస్ జెట్
ఇప్పటికే జెట్ ఎయిర్ వేస్, ఇండిగో సంస్థలు తక్కువ ధరలకు అర్ధరాత్రి నడిచే విమానాల సర్వీసులు ('రెడ్ ఐ ఫ్లైట్ సర్వీస్')ను అందజేస్తున్నాయి. తాజాగా గుర్గావ్ కు చెందిన స్పైస్ జెట్ కూడా తమ ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఈ కొత్త సర్వీసును ప్రారంభించనుంది. నవంబర్ 2 నుంచి ఈ సర్వీసెస్ ను మొదలుపెట్టనుంది. శీతాకాల షెడ్యూల్ లో భాగంగా ఇలాంటివే మరో ఆరు సర్వీసులను ప్రారంభించాలని కూడా ఈ సంస్థ భావిస్తోంది. దాంతో ఢిల్లీ-బెంగళూరు, ఢిల్లీ-నాందేడ్ కు నడిచే మిడ్ నైట్ విమానాల టికెట్ ధరలు తగ్గే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఢిల్లీ-బెంగళూరు మధ్య టికెట్ ధర రూ.3,889గా స్పైస్ జెట్ నిర్ణయించింది. సాధారణంగా రెడ్ ఐ విమానాలు అర్ధరాత్రి దాటాక ప్రయాణమై... తెల్లవారుజాముకు గమ్యస్థానాన్ని చేరతాయి.