: శ్రీశైలం ఘాట్ లో సింహం, పులుల మంద... బెంబేలెత్తిన మల్లన్న భక్తులు
శరన్నవ రాత్రి ఉత్సవాల్లో భాగంగా మల్లికార్జునస్వామి, భ్రమరాంబదేవిల సందర్శన కోసం శ్రీశైల క్షేత్రానికి వెళుతున్న భక్తులు నేటి ఉదయం తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కర్నూలు జిల్లా ఆత్మకూరు దాటి నల్లమల అటవీ ప్రాంతం మీదుగా వెళుతున్న భక్తులకు ప్రకాశం జిల్లా డోర్నాల మండలం సట్టుతండా సమీపంలో సింహం, పులుల గుంపు కనిపించింది. మందగా ఉన్న క్రూర జంతువుల సమూహంలో ఓ సింహం, మూడు పెద్ద పులులు, మరో మూడు పులి పిల్లలు కనిపించాయి. దీంతో భక్తులు భయాందోళనలకు గురయ్యారు. వెనువెంటనే అటవీ శాఖాధికారులకు సమాచారం చేరవేశారు. దీంతో ఆగమేఘాలపై అటవీ శాఖాధికారులు అక్కడికి బయలుదేరారు.