: పలువురు ఏపీ, తెలంగాణ నేతలకు రాజధాని శంకుస్థాపనకు ఆహ్వానం
నవ్యాంధ్ర రాజదాని అమరావతి శంకుస్థాపన మహోత్సవానికి ఈ ఉదయం పలువురు ప్రముఖులను ఏపీ మంత్రులు ఆహ్వానించారు. ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, తెలంగాణ సీఎల్పీ నేత జానారెడ్డి, తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి తదితరులను కలసి ఆహ్వానపత్రాలను అందజేశారు. మంత్రులు అయ్యన్నపాత్రుడు, కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ లు ఆహ్వానపత్రికలు స్వయంగా అందజేస్తున్నారు. రాజధాని అమరావతిని సాధ్యమైనంత త్వరగా నిర్మిస్తే బాగుంటుందని తనను కలసిన మంత్రులను ఈ సందర్భంగా జానా కోరారు. కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ఏపీ మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. అటు ఉపసభాపతి పద్మా దేవేందర్ రెడ్డి కూడా శంకుస్థాపన కార్యక్రమానికి హాజరవుతానని చెప్పారు.