: కిష్టారెడ్డి స్థానంలో రాంరెడ్డి వెంకటరెడ్డి... పీఏసీ చైర్మన్ గా నియామకం


తెలంగాణ అసెంబ్లీలో ప్రజా పద్దుల కమిటీ (పబ్లిక్ అకౌంట్స్ కమిటీ) చైర్మన్ పదవి నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి హఠాన్మరణంతో ఖాళీ అయ్యింది. ప్రతిపక్షానికి చెందిన సీనియర్ సభ్యుడిని పీఏసీ చైర్మన్ గా నియమించే సంప్రదాయాన్ని గౌరవించిన తెలంగాణ ప్రభుత్వం కిష్టారెడ్డిని ఆ పదవికి ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే గుండెపోటు కారణంగా ఇటీవల ఆయన నిద్రలోనే కన్నుమూశారు. ఈ నేసథ్యంలో ఆ పదవి నెలకు పైగానే ఖాళీగా ఉంది. కీలకమైన ఈ పదవి ఎక్కువ కాలం ఖాళీగా ఉండకూడదన్న భావనతో ప్రభుత్వం ఈ పదవిని నిన్న భర్తీ చేసింది. కిష్టారెడ్డి స్థానంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, ఆ పార్టీ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డిని నియమించింది. ఈ మేరకు నిన్న అసెంబ్లీ సెక్రటరీ రాజాసదారాం ఉత్తర్వులు జారీ చేశారు.

  • Loading...

More Telugu News