: బోనమెత్తిన సెన్సార్ బోర్డు సభ్యురాలు జీవిత... కోలాటమాడిన లక్ష్మణ్


తెలంగాణ సంప్రదాయ ఉత్సవం బతుకమ్మ వేడుకలు రాష్ట్రంలోనే కాక దేశ రాజధాని ఢిల్లీలోనూ ఘనంగా జరుగుతున్నాయి. నిన్న హైదరాబాదులోని బతుకమ్మ ఘాట్ లో జరిగిన వేడుకల్లో సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యురాలు, బీజేపీ మహిళా నేత, నటి జీవిత రాజశేఖర్ ఉత్సాహంగా పాల్గొన్నారు. బోనమెత్తుకుని వచ్చిన ఆమె వేడుకల్లో జోష్ నింపారు. మరోవైపు అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన వేడుకల్లో బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ సతీసమేతంగా హాజరై కోలాటమాడారు. ఇక మెదక్ జిల్లా రామాయంపేట మండలం డి.ధర్మారంలో జరిగిన వేడుకల్లో తెలంగాణ ప్రజాఫ్రంట్ కన్వీనర్ విమలక్క పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News