: ఎట్టకేలకు మోదీకి ఊరట... తప్పుడు అఫిడవిట్ కేసు కొట్టివేత
నేషనల్ జ్యుడీషియరీ అపాయింట్ మెంట్స్ కమిషన్ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించి సుప్రీంకోర్టు ప్రధాని నరేంద్ర మోదీకి నిన్న షాకిచ్చింది. ఆ తర్వాత మరికాసేపటికే ఆయనపై నమోదైన ఓ కేసును కొట్టివేసి సంతోషాన్ని అందించింది. ఒకే రోజు రెండు రకాల తీర్పులతో మోదీకి భిన్నంగా స్పందించాల్సిన పరిస్థితి ఎదురైంది. 2012లో జరిగిన గుజరాత్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలో మోదీ తప్పుడు అఫిడవిట్ సమర్పించారని కేసు నమోదైంది. దీనిపై సుదీర్ఘంగా విచారణ సాగింది. తొలుత గుజరాత్ హైకోర్టులో, ఆ తర్వాత సుప్రీంకోర్టుకు ఈ కేసు చేరింది. సుప్రీంలోనూ చాలా కాలం పాటు సాగిన విచారణలో మోదీ తప్పుడు అఫిడవిట్ కు సంబంధించి ప్రాసిక్యూషన్ సాక్ష్యాలను చూపలేకపోయింది. దీంతో మోదీపై నమోదైన సదరు కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది.