: నిర్భయ్ క్షిపణి ప్రయోగం విఫలం
నిర్భయ్ క్షిపణి ప్రయోగం విఫలమైంది. ఒడిశాలోని చందీపూర్ లో ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ద్వారా జరిగిన ప్రయోగం విఫలమవడంతో శాస్త్రవేత్తలు నిరాశ చెందారు. ఇది ప్రయోగించిన కొద్ది నిమిషాలకే క్షిపణి టార్గెట్ మిస్సయిందని డీఆర్డీఓ అధికారులు తెలిపారు. నిర్భయ్ క్షిపణి అణ్వస్త్రాలను మోసుకెళ్లే సామర్థ్యంతో పాటు ఉపరితలం నుంచి ఉపరితలం లక్ష్యాలను ఛేదిస్తుంది. మూడుసార్లు ప్రయోగించగా ఒకసారి మాత్రమే విజయవంతమైంది. కాగా, ఢిల్లీ గ్యాంగ్ రేప్ బాధితురాలు నిర్భయ గత ఏడాది అత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే. ప్రాణాల కోసం ఎంత పోరాడినా తీవ్ర గాయాల కారణంగా ఢిల్లీ గ్యాంగ్ రేప్ బాధితురాలు ప్రాణాలు కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఆమెను గౌరవించే విధంగా డీఆర్‌డీవో క్షిపణికి ‘నిర్భయ్’ అని పేరు పెట్టింది.