: వైవీ సుబ్బారెడ్డితో మాట్లాడమంటూ జగన్ ఫోన్ పెట్టేశారు: మంత్రి అయ్యన్నపాత్రుడు


రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి రావాలని ఆహ్వానిస్తూ వైఎస్సార్సీపీ అధినేత జగన్ కు ఫోన్ చేయగా, వైవీ సుబ్బారెడ్డితో మాట్లాడమంటూ జగన్ ఫోన్ పెట్టేశారని ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. దీంతో వైవీ సుబ్బారెడ్డితో మాట్లాడానని చెప్పారు. శంకుస్థాపనపై తమ వైఖరిని వెల్లడించామని, అయినా తమను ఎందుకు ఆహ్వానిస్తున్నారంటూ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారని అయ్యన్న తెలిపారు. రాజధాని శంకుస్థాపనకు జగన్ ని ఆహ్వానించాలనుకున్న ఏపీ మంత్రులకు ఆయన అపాయింట్మెంట్ నిరాకరించిన విషయం తెలిసిందే. జగన్ విశ్రాంతి తీసుకుంటున్నందునే ఆయన అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న జగన్ ని ఆహ్వానిస్తున్నామని, రావడం, రాకపోవడం ఆయన విఙ్ఞతకే వదిలివేస్తున్నామని మంత్రులు అంటున్నారు.

  • Loading...

More Telugu News