: అమరావతి చిహ్నం.. ముగిసిన ఎంట్రీల గడువు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి చిహ్నం రూపకల్పన కోసం ఎంట్రీల గడువు ముగిసింది. అమరావతి చిహ్నం కోసం ఇప్పటివరకు మొత్తం 2,500 ఎంట్రీలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ తో పాటు మొత్తం 15 రాష్ట్రాల నుంచి ఎంట్రీలు లభించాయి. అంతేకాకుండా కెనడా, యూఎస్, యూఏఈ, స్వీడన్, పోర్చుగల్, బ్రెజిల్ దేశాలతో పాటు వివిధ ప్రదేశాలలో ఉంటున్న ప్రవాసాంధ్రుల నుంచి కూడా ఎంట్రీలు అందాయి. మొత్తం ఎంట్రీలను పరిశీలించిన అనంతరం చిహ్నం, విజేతను నిపుణుల కమిటీ ఎంపిక చేయనుంది.