: సిక్కులకు ‘లాలూ’ క్షమాపణలు చెప్పాల్సిందే : సుశీల్ కుమార్ మోదీ


ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సిక్కులకు క్షమాపణలు చెప్పాలని భారతీయ జనతా పార్టీ నేత సుశీల్ కుమార్ మోదీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. బీహార్ లో ఎన్నికల ప్రచారం నేపథ్యంలో పార్టీల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవల ఒక ప్రచార సభలో లాలూ మాట్లాడుతూ, జైలు కూడా గురుద్వారా లాంటి ప్రదేశమేనని, ప్రతిఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా దీనిని సందర్శించాలని, లేకపోతే జీవితం అర్థవంతంకాదని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు సిక్కులను అవమానపరిచే విధంగా ఉన్నాయని సుశీల్ మోదీ మండిపడ్డారు. మసీదు గురించి అలాంటి వ్యాఖ్యలు చేసే దమ్ము లాలూకు ఉందా? అంటూ ఆయన ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News