: రోజుకు 20 స్పాంజిలు తింటే కానీ ఆమె నిద్రపోదు!


ఆహారం విషయంలో ఎవరి ఇష్టం వారిది. కొందరు పండ్లు తినడానికి ఇష్టపడతారు. మరికొందరు నాన్ వెజ్ తినడానికి ఆసక్తి చూపుతారు. ఇంకొందరు పోషకాహార విలువలున్న వాటిని లొట్టలేసుకుంటూ తింటారు. కానీ, ఎటువంటి ఆహారవిలువలు లేని పదార్థాలను ఎవరైనా తింటారా? ఇష్టపడతారా? అసలు అట్లాంటి వాళ్లు ఉంటారా? అంటే వుంటారనే చెప్పాలి. అందుకు నిదర్శనం ఎమ్మా థాంప్సన్! ఇంగ్లాండులోని వాల్సెండ్ కి చెందిన ఎమ్మా వయస్సు 23. ఆమెకు ఇష్టమైన ఆహారం కిచెన్ స్పాంజిలు. రోజుకు 20 స్పాంజిలు అవలీలగా లాగించేస్తుంది. గిన్నెలు కడగడానికి ఉపయోగించే యాపిల్ ఫ్లేవర్ లిక్విడ్ వాష్ లో ఆ స్పాంజిలను ఒక రాత్రంతా నానబెడుతుంది. మర్నాటి ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా లాగిస్తుంది. సుమారు ఇరవై సంవత్సరాల నుంచి ఎమ్మాకు ఈ అలవాటు ఉంది. దీంతో పలుసార్లు అనారోగ్యం పాలైంది. వాటికి దూరంగా ఉండమని వైద్యులు చాలాసార్లు హెచ్చరించారు కూడా. అయినా ఎమ్మా మారలేదు. ‘కొంతమంది పొగతాగుతారు, మరికొంతమంది మద్యం తాగుతారు, అట్లానే నేను స్పాంజిలు తింటాను. మూడేళ్ల వయస్సులో నాకు ఈ అలవాటైంది’ అని ఎమ్మా పేర్కొంది. ఈ అలవాటుపై వైద్యులు మాట్లాడుతూ, ఇది ఓసీడీ తరహా జబ్బు అని, దీని పేరు పికా అని అన్నారు. ఈ జబ్బు బారినపడినవాళ్లు ఆహార విలువలు లేని పదార్థాలను తింటుంటారని చెప్పారు.

  • Loading...

More Telugu News