: కవితను బతుకమ్మ ఆడనిచ్చే సమస్యే లేదంటున్న మహిళా సర్పంచ్


ఎంపీ కవితను తమ గ్రామంలో బతుకమ్మ ఆడనీయమని మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని అన్నాసాగర్ మహిళా సర్పంచ్ మంజుల రాంకోటి తెలిపారు. సాటి మహిళగా కవితను ఆహ్వానిస్తామే కానీ, బతుకమ్మ ఆడుతానంటే ఒప్పుకోమని అన్నారు. ఈరోజు సాయంత్రం బంగారు బతుకమ్మ వేడుకలు తమ గ్రామంలో జరగనున్నట్లు ఆమె చెప్పారు. తమ గ్రామంలో కనీస మౌలిక వసతులు కూడా లేవని, గ్రామ సమస్యలు తీరాకే బతుకమ్మ ఆడాలని అన్నారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యలు చేసుకుంటుంటే బంగారు బతుకమ్మ ఏ విధంగా ఆడతారని మంజుల ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News