: ఒడిశా సీఎం పుట్టినరోజు వేడుకల్లో విషాదం... విద్యార్థులకు గాయాలు


ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కు శుభాకాంక్షలు చెప్పేందుకు వెళ్లిన 11 మంది విద్యార్థులు గాయపడ్డారు. బిజూ జనతాదళ్ (బీజేడీ) పార్టీ కార్యాలయం వద్ద గ్యాస్ బెలూన్ పేలడంతో ఈ సంఘటన జరిగింది. క్షతగాత్రులను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల ముఖాలు, చేతులపై గాయాలయ్యాయని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. గాయపడిన వారిలో భువనేశ్వర్ రమాదేవి యూనివర్శిటీకి చెందిన 9 మంది విద్యార్థినులు ఉన్నారు. బీజేడీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు బాధిత విద్యార్థులను పరామర్శించారు. ప్రమాద సంఘటనపై భువనేశ్వర్ పోలీస్ కమిషనర్ ఆర్పీ శర్మ మాట్లాడుతూ, గ్యాస్ బెలూన్ కు సమీపంలో టపాకాయలు పేల్చడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని తాము భావిస్తున్నామన్నారు.

  • Loading...

More Telugu News