: ఏకే-47 తూటాల నుంచి తప్పించుకుంటూ... ఆరేళ్ల బాలుడికి జీహాదీ శిక్షణ


మూడేళ్ల బాలుడు ఒక బొమ్మ తల నరకుతుండగా తీసిన వీడియోను ఐఎస్ఐఎస్ గతంలో విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో వీడియోను విడుదల చేసింది. అందులో ఏకే 47 పేలుస్తుండగా వాటి నుంచి తప్పించుకుంటూ వెళ్తున్న ఆరేళ్ల బాలుడు ఉన్నాడు. ఆరేళ్ల బాలుడికి జిహాదీ శిక్షణ ఇస్తుండగా తీసిన వీడియోను ఉగ్రవాదులు విడుదల చేశారు. ఆ వీడియోలో.. ఒక ఉగ్రవాది ఏకే 47తో కాల్పులు జరుపుతుంటాడు. ఆ తూటాల నుంచి తప్పించుకుంటూ, తీగల కింద నుంచి దుమ్ములో పాక్కుంటూ వెళుతున్న ఒక బాలుడు కనిపిస్తాడు. ఆ బాలుడు భయంతో వణికిపోతూ, ఏడుస్తూ ఉంటాడు. పక్కనే నిలబడ్డ మరో ఉగ్రవాది ‘అల్లా హు అక్బర్’ అనే నినాదాలు చేస్తుంటాడు. అయితే, ఈ వీడియోను సిరియా లేదా ఇరాక్ లో తీసి ఉండవచ్చని భావిస్తున్నారు. కొత్తతరం ఉగ్రవాదుల్ని తయారు చేసుకునే ప్రయత్నాలలో భాగంగానే ఐఎన్ఐఎన్ ఉగ్రవాదులు ఈ తరహా శిక్షణ యిస్తున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News