: మరో ఘోరం... ఆవులను తీసుకెళ్తున్న ముస్లిం యువకుడిని కొట్టి చంపేశారు!


ఓవైపు గోమాంసంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ, ఆవులను ట్రక్కులో తరలిస్తున్నాడని ఆరోపిస్తూ, ఓ ముస్లిం యువకుడిని హిమాచల్ ప్రదేశ్ లో ప్రాణాలు పోయేలా కొట్టారు. రాష్ట్ర రాజధాని సిమ్లాకు దగ్గర్లో ఉన్న సరహాన్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్ కు చెందిన సోదర ద్వయం నోమన్, ఇమ్రాన్ అస్గర్ లు హిమాచల్ ప్రదేశ్ నుంచి కొన్ని ఆవులను లారీలో తీసుకువెళుతున్నారు. దీన్ని గుర్తించిన కొందరు వ్యక్తులు లారీని ఆపి, వీటిని చంపేందుకే తీసుకెళ్తున్నారని ఆరోపిస్తూ, వారిపై దాడి చేశారు. ఈ ఘటనలో నోమన్ తీవ్రగాయాల పాలు కాగా, విషయం తెలుసుకున్న పోలీసులు అతడిని ఆసుపత్రికి తరలించినా, ప్రాణాలు దక్కలేదు. భజరంగ దళ్ కు చెందిన వారు ఈ ఘటనలో సూత్రధారులని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యానేరం కింద కేసు పెట్టిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు.

  • Loading...

More Telugu News