: బిలియనీర్ల సంఖ్యలో అమెరికాను దాటేసిన చైనా


ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నది ఆసియా ఆర్థిక వ్యవస్థే. అందులోనూ ‘డ్రాగన్’గా ప్రసిద్ధిగాంచిన చైనా ఆర్థిక వ్యవస్థ శరవేగంగా పరుగులు పెడుతోంది. ఈ క్రమంలో ఆ దేశంలో బిలియనీర్ల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ప్రస్తుతం చైనాలో బిలియనీర్ల సంఖ్య 596కు చేరుకుందట. అగ్రరాజ్యం అమెరికాలో మాత్రం బిలియనీర్ల సంఖ్య కేవలం 537గానే ఉంది. ఏడాది కాలంగా చైనా ఆర్థిక వ్యవస్థలో వృద్ధి మందగించినా వ్యక్తిగత ఆస్తులు పెంచుకుంటున్న వారి సంఖ్య మాత్రం అంచెలంచెలుగా పెరిగిందని నిన్న రిలీజైన వెల్త్ రీసెర్చీ సంస్థ ‘హురన్’ నివేదిక వెల్లడించింది. చైనాలో అంతర్భాగంగా ఉన్న హాంగ్ కాంగ్ అండ్ మకావూలో మరో 119 మంది బిలియనీర్లు ఉన్నారట. వీరిని కూడా కలుపుకుంటే చైనా బిలియనీలర్ల సంఖ్య 715కు చేరుకుంటుందని ఆ నివేదిక తెలిపింది.

  • Loading...

More Telugu News