: అమరావతి శంకుస్థాపనకు హైదరాబాద్ లో పలువురికి ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి పలువురు రాజకీయ ప్రముఖులను ఏపీ ప్రభుత్వం ఆహ్వానించనుంది. ఈ రోజు, రేపు నగరంలోని వివిధ నేతలను మంత్రులు కామినేని, అయ్యన్నపాత్రుడు, టీడీపీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ ల బృందం వ్యక్తిగతంగా కలసి ఆహ్వానం పలకనుంది. తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి, టీఎస్ శాసన మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఏపీ మండలి ఛైర్మన్ చక్రపాణి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిలను ఆహ్వానించనున్నారు. మరోవైపు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తిగతంగా ఆహ్వానించనున్న సంగతి తెలిసిందే.