: ముప్పు తప్పించుకున్న ముషారఫ్
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ నేడు పెను ముప్పు నుంచి తప్పించుకున్నారు. న్యాయమూర్తుల తొలగింపు కేసులో ముషారఫ్ కు జ్యుడిషియల్ రిమాండ్ విధించిన కోర్టు ఆయన్ను ఫామ్ హౌస్ లోనే నిర్భంధించాల్సిందిగా ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో, తన స్వంత ఫామ్ హౌస్ లోనే ముషారఫ్ కస్టడీ అనుభవిస్తున్నారు. కాగా, ఇస్లామాబాద్ శివారులో ఉన్న ఈ ఫామ్ హౌస్ ఎదుట నేడు భారీగా పేలుడు పదార్థాలతో ఉన్న ఓ కారును గుర్తించారు. అనంతరం బాంబు డిస్పోజబుల్ స్క్వాడ్ ఆ పేలుడు పదార్ధాలను నిర్వీర్యం చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.