: జగన్ మానసిక స్థితి బాగా లేదు...‘శంకుస్థాపనకు రాను’ వ్యాఖ్యలపై గంటా కామెంట్


నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకు రాబోనన్న వైసీపీ అధినేత, ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటనపై ఏపీ మంత్రులు ముప్పేట దాడికి దిగారు. ఇప్పటికే పలువురు మంత్రులు జగన్ ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వంతు వచ్చింది. జగన్ కు మానసిక స్థితి సరిగా లేదని గంటా కొద్దిసేపటి క్రితం వ్యాఖ్యానించారు. అమరావతి శంకుస్థాపనకు వచ్చేందుకు ఇతర రాష్ట్రాల సీఎంలు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతుంటే... తాను మాత్రం ఈ కార్యక్రమానికి హాజరుకాలేనని జగన్ ప్రకటించడం విడ్డూరం కాక మరేమిటని కూడా గంటా వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News