: నా కొడుకు పెళ్లికి రండి... గవర్నర్ కు గంటా ఆహ్వానం

ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కొద్దిసేపటి క్రితం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను కలిశారు. హైదరాబాదులోని రాజ్ భవన్ కు వెళ్లిన గంటా గవర్నర్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. త్వరలో జరగనున్న తన కుమారుడి వివాహ వేడుకకు హాజరు కావాలని ఈ సందర్భంగా గంటా గవర్నర్ ను కోరారు. ఈ మేరకు గంటా తన కుమారుడి వివాహ వేడుకకు సంబంధించి ఆహ్వాన పత్రికను గవర్నర్ కు అందజేశారు. ఏపీ కేబినెట్ లో తన సహచర మంత్రి, పురపాలక శాఖ మంత్రి నారాయణ కూతురుతో గంటా కుమారుడి పెళ్లి నిశ్చయమైన సంగతి తెలిసిందే. త్వరలోనే వీరి వివాహం నెల్లూరులో అంగరంగవైభవంగా జరగనుంది.