: ఇంద్రకీలాద్రిపై పోలీసుల ఓవరాక్షన్... మీడియా ప్రతినిధులపై దాడి


దుర్గమ్మ చెంత ఇంద్రకీలాద్రి కొండపై విజయవాడ పోలీసులు రెచ్చిపోయారు. తమను ప్రశ్నించిన మీడియా ప్రతినిధులపై దాడికి దిగి గాయపరిచారు. వివరాల్లోకెళితే, అమ్మవారి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయ అధికారులు భక్తుల కోసం భారీ ఏర్పాట్లు చేశారు. అంతేకాక భద్రత కోసం పెద్ద సంఖ్యలో పోలీసులను రంగంలోకి దించారు. ఈ క్రమంలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన లిఫ్ట్ ను పోలీసులు వాడుతున్నారట. దీనిని ప్రశ్నించిన మీడియా ప్రతినిధులపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మమ్మల్నే ప్రశ్నిస్తారా? అంటూ దాడికి దిగారు. ఈ దాడిలో పలువురు మీడియా ప్రతినిధులకు గాయాలయ్యాయి. అంతటితో ఆగని పోలీసులు మీడియా ప్రతినిధుల కెమెరాలను లాక్కుని అందులో చిత్రీకరించిన దృశ్యాలను ధ్వంసం చేశారు. దీనిపై భగ్గుమన్న మీడియా ప్రతినిధులు అక్కడే నిరసనకు దిగారు.

  • Loading...

More Telugu News