: నా ఆదర్శ క్రికెటర్ వచ్చి ఫిక్సింగ్ చేద్దామన్నాడు, నోట మాట రాలేదు: బ్రెండన్ మెకల్లమ్
మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో న్యూజిలాండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ క్రిస్ కెయిర్న్స్ పై ఉచ్చు మరింతగా బిగుసుకుంటోంది. క్రిస్ ఓ మ్యాచ్ ని ఫిక్స్ చేయాలని అడిగేందుకు తన వద్దకు వచ్చాడని స్టార్ బ్యాట్స్ మన్ బ్రెండన్ మెకల్లమ్ లండన్ కోర్టులో సాక్ష్యమిచ్చాడు. "నేను ఆదర్శంగా భావించే క్రిస్ కెయిర్న్స్ నా వద్దకు వచ్చి మ్యాచ్ ఫిక్సింగ్ కు సాయం చేయమని అడిగాడు. ఒకసారి కాదు. మూడు సార్లు వచ్చాడు" అని చెప్పాడు. తొలిసారి ఫిక్సింగ్ చేయాలని అడిగినప్పుడే ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించగా, "అది నిజం కాదని, ఏదో జోక్ చేస్తున్నాడని భావించాను. పైగా అతను నాకు మంచి స్నేహితుడు కూడా" అని చెప్పాడు. కాగా, మ్యాచ్ ఫిక్సింగ్ లకు క్రిస్ కారణమంటూ ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోదీ ఆరోపించిన తరువాత ఈ కేసు నమోదుకాగా, పలువురు ఆటగాళ్లు క్రిస్ కు వ్యతిరేకంగా ఇప్పటికే కోర్టులో వాగ్మూలం ఇచ్చిన సంగతి తెలిసిందే.