: దుర్గమ్మ సేవలో మంత్రి కొల్లు... ‘శంకుస్థాపన’ నిర్విఘ్నంగా జరగాలని పూజలు
నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సహా ఆయన కేబినెట్ లోని మంత్రులంతా ఈ పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. నిర్ణీత సమయంలోగా పనులను పూర్తి చేయాలని రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. ఈ క్రమంలో రాజధాని శంకుస్థాపనకు ఎలాంటి విఘ్నాలు ఎదురుకాకుండా చూడాలంటూ మంత్రులు తమ మనసుల్లోనే దేవ దేవుళ్లను వేడుకుంటున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎమ్మెల్యే, చంద్రబాబు కేబినెట్ లో అబ్కారీ శాఖ మంత్రిగా ఉన్న కొల్లు రవీంద్ర నేటి ఉదయం బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. రాజధాని శంకుస్థాపన నిర్విఘ్నంగా జరగాలని ఆయన దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేశారు.