: తెలంగాణలో టూ బెడ్ రూం ఫ్లాట్లు ఎలా పంచుతారంటే..!
కేసీఆర్ మానసపుత్రికగా, తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న 'పేదలకు డబుల్ బెడ్ రూం' ఇళ్ల పథకం మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దీని ప్రకారం, ఇల్లు పొందేవారు దారిద్ర్య రేఖకు దిగువన ఉండాలి. ఆహార భద్రత కార్డు కూడా ఉండాలి. అసలు ఇళ్లు లేనివారికి, కచ్చా ఇళ్లు, అద్దె ఇళ్లల్లో ఉండేవారే ఈ పథకానికి అర్హులు. అసెంబ్లీ పరిధిలో అయితే, ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం, మైనారిటీలకు 7 శాతం రిజర్వేషన్లుంటాయి. పట్టణాల్లో ఎస్సీలకు 17 శాతం, ఎస్టీలకు 6 శాతం, మైనారిటీలకు 12 శాతం ఇళ్లను కేటాయిస్తారు. మిగిలినవి ఇతర వర్గాల ప్రజలకు ప్రకటిస్తారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తయిన తరువాత గ్రామ, వార్డు సభల్లో దీన్ని ధ్రువపరచాల్సి వుంటుంది. ఆపై ఎమ్మార్వో, కలెక్టర్, ఎమ్మెల్యే, మునిసిపల్ కమిషనర్ తదితరులు దీన్ని ఖరారు చేస్తారు.