: భారత జాలర్లపై పాక్ కాల్పులు... ఒకరికి గాయాలు, అదుపులో 24 మంది జాలర్లు
భారత జాలర్లపై పాకిస్థాన్ మారిటైం సెక్యురిటీ ఏజెన్సీ(ఎంఎస్ఏ) అధికారులు కాల్పులు జరిపారు. అరేబియా సముద్రంలో జరిగిన ఈ సంఘటనలో ఒక జాలరికి గాయాలయ్యాయి. గుజరాత్ తీర సమీపంలోని అంతర్జాతీయ సముద్ర జలాల సరిహద్దుల్లో ఎంఎస్ఏ అధికారులు 24 మంది జాలర్లను అదుపులోకి తీసుకున్నారు. నాలుగు పడవలను స్వాధీనం చేసుకున్నారు. ‘పడవలో వచ్చిన పాక్ అధికారులు భారత జాలర్లపై కాల్పులకు పాల్పడ్డారు. అదుపులోకి తీసుకున్న జాలర్లను కరాచీ పోర్టుకు తీసుకెళ్లారు’ అని జాలర్ల సంఘానికి చెందిన వారు పేర్కొన్నారు.