: మార్కెట్లోకి కొత్త ద్విచక్రవాహనం విడుదల
మహీంద్రా సంస్థ కొత్త ద్విచక్రవాహనాన్ని ఈరోజు మార్కెట్లోకి విడుదల చేసింది. మోజో పేరిట విడుదలైన ఈ ద్విచక్రవాహనం ధర రూ.1.58 లక్షలుగా మహీంద్రా సంస్థ ప్రకటించింది. ఈ వాహనాన్ని పలు ఆధునిక ఫీచర్లతో రూపొందించినట్లు సంస్థ ప్రతినిధులు చెప్పారు. 21 లీటర్ల ఇంధనం పట్టే ట్యాంకర్, ఆధునిక ఎలక్ట్రానిక్ ఫుయెల్ ఇగ్నిషన్, ఇరిడియం స్పార్క్ ప్లగ్, రిసోనేటర్ ఫిట్టెడ్ ఇన్ టేక్ సిస్టమ్ ను ఈ కొత్త బైక్ లో ఏర్పాటు చేసినట్లు వివరించారు. రేపటి నుంచి ఆన్ లైన్ బుకింగ్స్ ప్రారంభమవుతాయని, ఈ అవకాశం దీపావళి వరకు ఉంటుందని ప్రతినిధులు తెలిపారు.