: డీజిల్ ధర లీటర్ కు 95 పైసలు పెంపు


చమురు మార్కెటింగ్ సంస్థల నిర్ణయం మేరకు పెట్రోల్ ధర యథాతథంగా ఉండగా, డీజిల్ ధర మాత్రం పెరిగింది. డీజిల్ ధర లీటర్ పై 95 పైసలు చొప్పున పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయాన్ని ప్రకటించాయి. పెంచిన ధరలు నేటి అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి. కాగా, ఈ సంవత్సరం ఇప్పటికే పలుమార్లు పెట్రోలు, డీజిల్ లతో పాటు వంట గ్యాస్ ధరలు తగ్గుతూ వచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News