: 'బ్రూస్ లీ'పై ఐటీ దాడులు
టాలీవుడ్ పై ఆదాయపు పన్ను శాఖ పంజా విసిరింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన 'బ్రూస్ లీ' చిత్రమే ప్రధాన లక్ష్యంగా ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. నిర్మాత డీవీవీ దానయ్య, ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల, సంగీత దర్శకుడు థమన్ నివాసాలపై దాడులు జరిగాయి. శ్రీను వైట్ల, దానయ్య నివాసాలతో పాటు, వారి కార్యాలయాలు, వారి బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు జరుపుతున్నారు. రామ్ చరణ్ నటించిన బ్రూస్ లీ చిత్రాన్ని రూ. 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కొద్ది రోజుల క్రితం తమిళ స్టార్ హీరో విజయ్, హీరోయిన్లు నయనతార, సమంత, నిర్మాతలు కలైపులి ఎస్ థాను, మధురై అన్బు నివాసాలపై కూడా ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో పెద్ద ఎత్తున నగదు, బంగారాన్ని ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.