: మన దేశ మొట్టమొదటి ప్రధాని మోదీ అట!... గూగుల్ ఆన్సర్ ఇది!
గూగుల్ డైరెక్ట్ ఆన్సర్ ఫీచర్ తాజాగా మరో పొరపాటు చేసింది. గూగుల్ డైరెక్ట్ ఆన్సర్ ఫీచర్ లో టాప్ 10 నేరస్తుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోను పెట్టిన సంఘటన మరువక ముందే మరో తప్పిదం చేసింది ఆ సంస్థ. భారతదేశ తొలి ప్రధానిగా పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గురించి సరైన సమాచారం ఇచ్చిన గూగుల్ డైరెక్ట్ ఆన్సర్ ఫీచర్, ఫొటో విషయంలో పొరపాటు పడింది. నెహ్రూ ఫొటోకు బదులుగా ప్రస్తుత ప్రధాని మోదీ ఫొటోను ఉంచింది. దీంతో నెటిజన్ల నుంచి పలు విమర్శలు వెల్లువెత్తాయి. కాగా, ఎవరికి ఎటువంటి సమాచారం కావాలన్నా గూగుల్ సెర్చ్ ఇంజన్ ను ఆశ్రయిస్తూ ఉంటారు. ‘గూగుల్ తల్లి’ అని ప్రేమగా పిలుచుకుంటూ ఉంటారు. ఒకే ఒక్క క్లిక్ తో వినియోగదారులకు మరింత మెరుగైన సమాచారం అందించేందుకుగాను 2013లో గూగుల్ డైరెక్ట్ ఆన్సర్ ఫీచర్ ను ప్రవేశపెట్టింది ఆ సంస్థ.